Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ సిగ్గుపడేలా చేశాడు.. మాజీ ప్రియుడిపై అనుపమ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మాజీ ప్రియుడి ప్రవర్తన గురించి మాట్లాడారు. అతడి కారణంగా ఒక నటిగా, మహిళగా తనను తాను నిందించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
షాకింగ్ కామెంట్..
ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన రెండో భాగం తాజాగా విడుదలైంది.
ఇందులో అనుపమ మాట్లాడుతూ.. ''నేను నటిని అయినందుకు, ధైర్యంగా ఉన్నందుకు, ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే మహిళను అయినందుకు సిగ్గుపడేలా చేశాడు.
నెలలో ఏ రోజు వెళ్లి అతడి తప్పులను ప్రశ్నించినా.. 'ఓహో.. నీకు పీరియడ్స్ సమయమా? ఇంకా రాలేదా? మూడ్ స్వింగ్స్ కదా' అంటూ చులకనగా మాట్లాడేవాడు.
ఆ మాటలతో నాపై నాకే అసహ్యం కలిగింది'' అని చెప్పారు. ''ఒకప్పుడు నాకు 11 మంది పిల్లలు ఉండాలని కలలు కనేదాన్ని.
ఆ తర్వాత అసలు పిల్లలే వద్దు అనే స్థాయికి వెళ్లిపోయాను. ఒక మహిళగా పుట్టినందుకే ఇలాంటి మాటలు వినాల్సి వచ్చిందా? అని అనిపించేది'' అంటూ అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
రెండేళ్ల పాటు అలాంటి వ్యక్తితో రిలేషన్‌షిప్..
సుమారు రెండేళ్ల పాటు తాను అలాంటి వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని అనుపమ వెల్లడించారు.
ఆ బంధం కారణంగా తాను తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపారు.
షూటింగ్ సమయంలో సెట్‌లోని క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేదానినని చెప్పారు.
చివరికి తన సొంత తమ్ముడితో చనువుగా ఉండటానికి కూడా భయపడినట్లు అనుపమ గుర్తుచేసుకున్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్ పేరును మాత్రం వెల్లడించలేదు.