Ghaati Release Date : 'ఘాటి' విడుదల తేదీ ప్రకటించిన అనుష్క.. ఎప్పుడంటే?
వేదం, కంచె వంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన జాగర్లమూడి కృష్ణ (క్రిష్) ఘాటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కనిపిస్తోంది. నాలుగేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మేకర్స్ తాజాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క ఓ ట్రైబల్ అమ్మాయి పాత్రలో కనిపించనుంది.
ఘాటిపై భారీ అంచనాలు
కొండల లోయల మధ్య నివసించే జీవితాల ఆధారంగా ఈ కథ సాగుతుంది. 'కొండపొలం' చిత్రం అపజయం తర్వాత క్రిష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఘాటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సమ్మర్‌లో పాన్-ఇండియా ప్రేక్షకులను అలరించబోతున్న ఈ చిత్రం, క్రిష్, అనుష్క కాంబినేషన్ నుంచి మరో విభిన్న ప్రయత్నంగా నిలుస్తుందా? అనేది చూడాలి.