Page Loader
Anushka: 'ఘాటి' రెండు ట్రైలర్లు సిద్ధం అవుతున్నాయా?
'ఘాటి' రెండు ట్రైలర్లు సిద్ధం అవుతున్నాయా?

Anushka: 'ఘాటి' రెండు ట్రైలర్లు సిద్ధం అవుతున్నాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న 'ఘాటి' సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క ఒక బాధితురాలిగా మొదలై, ఆ తరువాత నేరస్తురాలిగా మారే శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలోని మేజర్ పార్ట్ షూటింగ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అడవి ప్రాంతాల్లోనే జరిపారు. ఆ యథార్థతకు తగ్గట్టుగా చిత్రీకరించిన అడవి నేపథ్య సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

వివరాలు 

ప్రమోషన్ విషయంలో కొత్త ప్రణాళికలు

ప్రత్యేకంగా యాక్షన్,ఛేజింగ్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయని సమాచారం. ఈ స్టంట్స్ విషయంలో అనుష్క ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా,అసలైన లొకేషన్లలో రియల్ స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంది. ఈ విషయమై సినిమా బృందం మంచి నమ్మకంతో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తయ్యాక, సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రమోషన్ విషయంలో కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు.అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి రెండు ట్రైలర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి ట్రైలర్‌ను ఈ నెలాఖరుకు విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం క్రిష్,ట్రైలర్ కట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. రెండవ ట్రైలర్‌ను సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

వివరాలు 

ప్రభాస్ పూర్తి స్థాయిలో మద్దతు

ఇప్పటి వరకు సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. పాటలు ఇంకా విడుదల చేయలేదు. ఫిబ్రవరి ముగింపు దశలో ఉంది, మార్చి సమీపిస్తోంది. అయినప్పటికీ చిత్రంపై సరైన బజ్ లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, సినిమా ప్రచారాన్ని బలంగా నిర్వహించేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనుష్కకు మంచి స్నేహితుడిగా, అలాగే ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న కారణంగా ప్రభాస్ సహాయం సినిమా ప్రచారానికి దోహదపడే అవకాశం ఉంది.