
Ghaati : అనుష్క 'ఘాటీ' రిలీజ్‌కు బ్రేక్.. ఖరారు చేసిన టీం!
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఘాటి' రిలీజ్ మళ్లీ వాయిదా పడింది. తొలుత విడుదల తేదీ జులై 11గా ప్రకటించిన చిత్రబృందం, తాజాగా ఆ తేదీకి సినిమా విడుదల కావడం లేదని అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ఆలస్యమవుతోంది. ఈ సందర్భంగా ఘాటి టీం ఒక భావోద్వేగపూరిత ప్రకటన చేసింది. సినిమా అనేది భార్య నది లాంటిది. ఒక్కోసారి అది వేగంగా ప్రవహిస్తుంది, ఒక్కోసారి లోతు పెంచుకునే అవసరంతో నిలకడగా ప్రవహిస్తుంది. 'ఘాటి' కేవలం సినిమా కాదు, ప్రకృతిలో ఓ భాగమని వెల్లడించింది.
Details
త్వరలోనే రిలీజ్ తేదీపై ప్రకటన
ప్రతి ఫ్రేమ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రేక్షకులు చూసే ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉండాలనే లక్ష్యంతోనే సినిమాను మళ్లీ వాయిదా వేస్తున్నామని టీం పేర్కొంది. ప్రేక్షకుల ప్రేమకు, సహనానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. "అత్యుత్తమ అవుట్‌పుట్‌తో త్వరలో మీ ముందుకు వస్తామని హామీ ఇచ్చారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబా గుడి నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. సంభాషణలు రచనకు సాయి మాధవ్ బుర్రా పని చేస్తున్నారు.