LOADING...
Ghati : సెన్సార్ క్లియర్ చేసుకున్న 'ఘాటి'.. ఇంటర్వెల్ తర్వాత మాస్ ట్రీట్?

Ghati : సెన్సార్ క్లియర్ చేసుకున్న 'ఘాటి'.. ఇంటర్వెల్ తర్వాత మాస్ ట్రీట్?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అందాల తార అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఘాటి' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడొస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. మొదట విడుదల కావాల్సిన తేదీ నుంచి పలు సార్లు వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు చివరికి సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం రెడీ అయింది. రిలీజ్ ముందు ప్రమోషన్లను కూడా చిత్రబృందం శరవేగంగా జరుపుతున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

వివరాలు 

మూవీ రన్‌టైమ్‌

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఇందులో అనుష్క పోషిస్తున్న 'శీలవతి' పాత్ర ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఆమె స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. అలాగే ఈ మూవీ రన్‌టైమ్‌ను 2 గంటల 37 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకి అదనపు బలాన్నిస్తాయని, థియేటర్లలో సూపర్బ్ థ్రిల్ ఇస్తాయని యూనిట్ చెబుతోంది. సినిమా చూసిన సెన్సార్ కమిటీ సభ్యులు కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారన్న వార్త బయటకు వచ్చింది.

వివరాలు 

గంజాయి మాఫియా నేపథ్యంలో సాగే సెకండ్ హాఫ్..

ముఖ్యంగా ఇందులోని 7-8హై ఇంపాక్ట్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని టాక్ వినిపిస్తోంది. కథ పరంగా చూస్తే, సినిమా ఎమోషనల్ టచ్‌తో స్టార్ట్ అయి,ఇంటర్వెల్ వరకు సాఫ్ట్‌గా నడుస్తుంది. అయితే,ఇంటర్వెల్ తర్వాత మాత్రం కథ ఒక్కసారిగా మాస్ యాక్షన్ మోడ్‌లోకి మారిపోతుందని, ఆడియన్స్‌కు భారీ షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. గంజాయి మాఫియా నేపథ్యంలో సాగే సెకండ్ హాఫ్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఉత్కంఠను రేకెత్తించనుందట. ఇక అనుష్క శెట్టి చాలా అరుదుగానే సినిమాలు చేస్తుండటంతో,ఆమె అభిమానులు కొత్త మూవీ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు'ఘాటి'తో ఆ వెయిటింగ్‌కి ఎండ్ కార్డ్ పడబోతోందన్న ఆనందం ఫ్యాన్స్‌ ఉన్నారు.