Page Loader
Rajdhani Files: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు షాక్.. రాజధాని ఫైల్స్' విడుదలకు గ్రీన్ సిగ్నల్ 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు షాక్.. రాజధాని ఫైల్స్' విడుదలకు గ్రీన్ సిగ్నల్

Rajdhani Files: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు షాక్.. రాజధాని ఫైల్స్' విడుదలకు గ్రీన్ సిగ్నల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2024
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ తెరకెక్కిన 'రాజధాని ఫైల్స్‌' సినిమా విడుదలపై హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రివైజింగ్‌ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో నేటి నుంచి యధావిధిగా రాజధాని ఫైల్స్‌ షోలు కొనసాగనున్నాయి. రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు గురువారం అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన స్టే పిటిషన్‌పై హైకోర్టు బుధవారం తన ఉత్తర్వులను రిజర్వు చేసింది. సినిమాలోని పాత్రలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)ని పోలి ఉన్నాయని అప్పిరెడ్డి తరపు న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్ వాదించారు.

Details 

నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ 

పాత్రలకు పెట్టిన పేర్లు కూడా ముఖ్యమంత్రి,మాజీ మంత్రి పేర్లను పోలి ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్ జయసూర్య సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేయాలని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం విచారణ చేపట్టి సినిమా రిలీజ్ కి అంగీకారం తెలిపారు. సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ఇచ్చిన డాకుమెంట్స్ ను పరిశీలించిన కోర్టు.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను కోర్టు వాయిదా వేసింది.