Page Loader
సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు: టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ పై ఏపీ హైకోర్టు ప్రశ్న 
టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టీజర్ పై హైకోర్టు ప్రశ్నలు

సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు: టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ పై ఏపీ హైకోర్టు ప్రశ్న 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 31, 2023
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా నుండి టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యంతరం తెలియజేసింది. టీజర్ లో వాడిన పదప్రయోగం ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని, స్టూవర్టుపురం ప్రాంతాన్ని అవమానించేలా ఉందని హైకోర్టు తెలిపింది. ఇలాంటి సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని చిత్ర నిర్మాణ సంస్థను ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా సినిమా టీజర్ ని ఎలా రిలీజ్ చేస్తారని అడిగింది.

Details

నాలుగు వారాల పాటు విచారణ వాయిదా 

ఈ వ్యాజ్యంలో ముంబై సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్ పర్సన్ ను ప్రతివాదిగా చేర్చాలని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవి శేషసాయి తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టీజర్ లో వినిపించిన పద ప్రయోగం ఎరుకల సామాజిక వర్గాన్ని స్టూవర్టుపురం ప్రాంత వాసుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని చుక్కా పాల్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేశారు. దీనిపై బుధవారం జరిగిన విచారణలో పిటీషనర్ తరపున ఆంకాళ్ళ పృథ్వీరాజ్, శృంగారపాటి కార్తీక్ న్యాయవాదులు తమ వాదనలు కోర్టుకు వినిపించారు. ప్రస్తుతానికి ఈ విచారణను నాలుగు వారాలపాటు హైకోర్టు వాయిదా వేసింది.