
Mohan Babu: జర్నలిస్టులకు క్షమాపణ.. రంజిత్‌ను పరామర్శించిన మోహన్ బాబు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్‌ను ప్రముఖ నటుడు మోహన్‌బాబు పరామర్శించారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు రంజిత్ కుటుంబ సభ్యులతో పాటు జర్నలిస్టుల సమాజానికి క్షమాపణలు తెలిపారు.
రంజిత్ తల్లి, భార్య, పిల్లలను కలిసి తన తప్పిదానికి బాధపడ్డానని, నొప్పి బాధ ఏంటో తనకు తెలుసునని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తాను కొట్టలేదని మోహన్‌బాబు అన్నారు.
తన వల్ల జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనని, గాయం నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని మోహన్ బాబు చెప్పారు.
Details
మీడియా ప్రతినిధులందరికీ క్షమాపణలు తెలిపిన మోహన్ బాబు
దీనిపై రంజిత్ స్పందించారు. క్షమాపణలు వ్యక్తిగతంగా తనకే కాకుండా జర్నలిస్టుల సమాజానికి కూడా చెప్పాలని అన్నారు.
రంజిత్‌ను ఆసుపత్రిలో పరామర్శించడంతో పాటు మీడియా ప్రతినిధులందరికి క్షమాపణలు చెప్పారు.
తన చర్య వల్ల కలిగిన బాధను అర్థం చేసుకున్నానని, జర్నలిస్టుల సమాజం చేస్తున్న సేవల్ని గౌరవిస్తానని ఆయన తెలిపారు మోహన్‌బాబు క్షమాపణలు చెప్పినా జర్నలిస్టు సంఘాలు ఇంకా నిరసనలు చేస్తుండటం గమనార్హం.