
AP Film Chamber of Commerce: కర్నూలులో ఏపీ ఫిల్మ్ ఛాంబర్.. అధ్యక్షుడిగా టీజీ వెంకటేష్ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కర్నూలులో స్థాపించారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ఛైర్మన్‌గా టీజీ వెంకటేష్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో ఏర్పాటు చేశామని, మనం సినిమాల పరిశ్రమను ఏపీలో స్థాపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
గతంలో తమిళనాడు సినిమా పరిశ్రమకు పుట్టినిల్లు అయిందని, మద్రాస్‌లో రాయలసీమ వాసులు పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారన్నారు.
కళలకు పుట్టినిల్లు రాయలసీమ అని పేర్కొన్నారు.
Details
పూర్తి సహకారం అందిస్తాం
ఆతర్వాత సినిమా పరిశ్రమకు ఎక్కువ ఫైనాన్స్ ఇవ్వడం కూడా మా రాయలసీమ వాసులందరికీ సంబంధించినదని గుర్తు చేశారు.
అయితే ఇక్కడ సినిమాలు నిర్మాణం, చిత్రీకరణ జరగడం లేదన్నారు.
రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్‌లో కొనసాగుతోందని, ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిజాయితీతో పనిచేస్తుందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సహకారం, అనుమతులు కావాలంటే తాము వారికి పూర్తి సహాయం అందిస్తామని పేర్కొన్నారు.