రామ్ చరణ్ సినిమాకు ట్యూన్లు అందించనున్న ఆస్కార్ విజేత?
ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజకీయాలు ప్రధానంగా కనిపించే ఈ చిత్రంలో ఎన్నికల ప్రధాన అధికారిగా రామ్ చరణ్ కనిపించనున్నాడని వినిపిస్తోంది. అదలా ఉంచితే, తాజాగా రామ్ చరణ్ 16వ సినిమా గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పనిచేయనున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని ఏఆర్ రెహమాన్ తెలియజేసినట్లు వినిపిస్తోంది.
రామ్ చరణ్ అభిమానుల్లో మిశ్రమ స్పందన
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడనే పుకార్లు రామ్ చరణ్ అభిమానుల్లో మిశ్రమ స్పందన కలిగింస్తున్నాయి. రెహమాన్ సంగీతానికి రామ్ చరణ్ స్టెప్పులు చూడాలని కొంతమంది ఆశపడుతుంటే, మరికొంతమందేమో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సినిమాల సెంటిమెంటును గుర్తు చేసుకుంటున్నారు. సూపర్ పోలీస్, నాని, కొమురం పులి వంటి తెలుగు చిత్రాలకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయ్. ఇప్పుడిదే అంశం రామ్ చరణ్ అభిమానుల్లో ఒకరకమైన టెన్షన్ ని పుట్టిస్తోంది. ఇలా టెన్షన్ పడుతున్నవారికి ఏ మాయ చేశావే వంటి విజయవంతమైన చిత్రాన్ని చూపిస్తూ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.