AR Rahman: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏఆర్ రెహమాన్.. కుటుంబ సభ్యుల స్పష్టత!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.
ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు శనివారం రాత్రి చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం తాజాగా డిశ్చార్జ్ అయిన రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు ఆయన సోదరి రిహానా వెల్లడించారు.
ఇటీవల రెహమాన్ వ్యక్తిగత జీవితం పలు కారణాలతో వార్తల్లో నిలిచింది. 29 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతూ భార్యతో విడిపోయిన ఆయనకు ముగ్గురు సంతానం ఉన్నారు. మనస్పర్థల కారణంగా ఈ విడాకులు జరిగాయని తెలుస్తోంది.
Details
రామ్ చరణ్ సినిమాకి రెండు పాటలు తయారు చేసిన రెహమాన్
వృత్తిపరంగా, బాలీవుడ్‌లో హల్‌చల్ చేసిన విక్కీ కౌశల్ 'ఛావా' చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్, టాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న #RC16 చిత్రానికి స్వరపరిచేందుకు ఇప్పటికే రెండు పాటలు రెడీ చేసినట్లు సమాచారం.
అయితే రెహమాన్ ఆసుపత్రిలో చేరారనే వార్తలు అభిమానులను కంగారుపెట్టినా, ఆయన త్వరగా కోలుకున్నారని తెలిసి ఊరట చెందారు.