NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / AR Rahman: రెహమాన్‌, సైరా బాను విడాకుల కథనాలపై స్పందించిన తనయుడు అమీన్‌ 
    తదుపరి వార్తా కథనం
    AR Rahman: రెహమాన్‌, సైరా బాను విడాకుల కథనాలపై స్పందించిన తనయుడు అమీన్‌ 
    రెహమాన్‌, సైరా బాను విడాకుల కథనాలపై స్పందించిన తనయుడు అమీన్‌

    AR Rahman: రెహమాన్‌, సైరా బాను విడాకుల కథనాలపై స్పందించిన తనయుడు అమీన్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    06:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman)తన భార్య సైరా బాను (Saira Banu) విడాకులపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు.

    వీటి పట్ల ఆయన తనయుడు అమీన్ తీవ్రంగా స్పందించారు.

    ''నా తండ్రి గురించి వచ్చిన అసత్య కథనాలు నన్నెంతో బాధపెట్టాయి.ఆయన వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా గొప్ప వ్యక్తి. దయచేసి ఆయన జీవితం, లెగసీ గురించి అసత్యాలను వ్యాప్తి చేయడం ఆపండి'' అని అమీన్ ఎక్స్‌ వేదికలో పేర్కొన్నారు.

    అమీన్ పోస్ట్‌లో ''మా నాన్న ఒక లెజెండరీ వ్యక్తి. ఆయన ఎన్నేళ్లుగా అద్భుతమైన సంగీతాన్ని అందించి,కోట్లాది మంది అభిమానాన్ని పొందారు.ఎలాంటి ఆధారాలు లేకుండా వస్తున్న వదంతులు బాధ కలిగిస్తున్నాయి.ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు నిజాయితీకి ప్రాముఖ్యత ఇవ్వాలి'' అని అన్నారు.

    వివరాలు 

    మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటన 

    మంగళవారం సాయంత్రం, రెహమాన్ దంపతులు తమ 29 ఏళ్ల వైవాహిక జీవితం ముగిసిందని ప్రకటించారు.

    ''మా బంధం త్వరలో 30 ఏళ్లకు చేరుతుందని అనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో దీనికి ముగింపు పలకాల్సి వచ్చింది'' అని రెహమాన్ తెలిపారు.

    ఇదే రోజున, రెహమాన్ బృందానికి చెందిన మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించడంతో, ఈ రెండు జంటల విడాకుల మధ్య సంబంధం ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    ఈ వదంతులపై సైరా తరఫు న్యాయవాది వందనా షా స్పందించారు. ''ఇందులో ఎలాంటి నిజం లేదు. పరస్పర అంగీకారంతో మాత్రమే రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నారు'' అని ఆమె స్పష్టం చేశారు.

    వివరాలు 

    సామాజిక మాధ్యమాల వేదికగా రెహమాన్ కుటుంబ సభ్యులు

    అయినా, అసత్య వార్తలు ఆగకపోవడంతో, రెహమాన్ కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.

    రెహమాన్ కుమార్తె రహీమా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, ''వదంతులను సృష్టించేవారు మనలను ద్వేషించే వాళ్లు, వాటిని వ్యాప్తి చేసేవారు తెలివితక్కువవాళ్లు, వాటిని నమ్మేవారు పనికిరానివాళ్లు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి'' అని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    సినిమా

    upcoming movies telugu: ఈ వారం చిన్న చిత్రాలదే సందడి.. ఇక ఓటీటీలో వచ్చే మూవీస్‌ ఇవే!  టాలీవుడ్
    MechanicRocky : విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' ట్రైలర్ డేట్ ఖరారు.. మూవీ రిలీజ్ తేదీలో మార్పులు! విశ్వక్ సేన్
    Tangalan: నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్.. దీపావళి కానుకగా రిలీజ్ తంగలాన్
    Naga Chaitanya: మరో వెబ్‌ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య? పీఆర్వో టీం క్లారిటీ అక్కినేని నాగచైతన్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025