Page Loader
Peddi: పెద్ధి సినిమా కోసం ఊరినే నిర్మిస్తున్నారా?.. మేకింగ్ డీటెయిల్స్ వైరల్..!
పెద్ధి సినిమా కోసం ఊరినే నిర్మిస్తున్నారా?.. మేకింగ్ డీటెయిల్స్ వైరల్..!

Peddi: పెద్ధి సినిమా కోసం ఊరినే నిర్మిస్తున్నారా?.. మేకింగ్ డీటెయిల్స్ వైరల్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్‌గా పేరొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా 'పెద్ది'పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన, తాత్కాలికంగా వచ్చిన 'గేమ్ ఛేంజర్' ఫలితాన్ని పక్కనపెట్టి మళ్లీ స్పీడ్ పెంచేశాడు. ఈసారి బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఒక మాస్, మోటివేషనల్ స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్నాడు చరణ్. ఈ చిత్రంలో కథకు కీలకంగా నిలిచే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను విజయనగరం లోకేషన్‌లో చిత్రీకరించాలని భావించారు. అయితే అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, హైదరాబాద్‌లోనే విజయనగరం వాతావరణాన్ని గుర్తు చేసే విధంగా ప్రత్యేకంగా సెట్ వేశారు.

Details

క్రికెటర్ గా రామ్ చరణ్

ఈ సెట్‌ కోసం నిర్మాతలు ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల సినిమాపై ఉండే అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. 'పెద్ది'లో రామ్ చరణ్ ఓ క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన చిన్న గ్లింప్స్‌కి విశేష స్పందన లభించింది. లుక్, కథ అంతా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తోన్నది ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్. మాస్ నేపథ్యానికి ఆయన సంగీతం ఎంతగా బూస్ట్ ఇస్తుందో చూడాలి.

Details

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న చరణ్ ఫోటో వైరల్

ట్యూన్స్ ఇప్పటికే రెడీ అయ్యాయని ఇండస్ట్రీలో టాక్. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఎంపికయ్యారు. 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, వెంటనే చరణ్ ప్రాజెక్ట్‌ను కూడా ఖాయంచేసుకోవడం విశేషం. ఇక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో రామ్ చరణ్ తీసుకుంటున్న శ్రద్ధకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇటీవల జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న చరణ్ ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ లుక్‌ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. సినిమాపై ఆయన చూపిస్తున్న డెడికేషన్‌ను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.