Page Loader
పవన్ కళ్యాణ్ ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ వచ్చేసింది 
ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ విడుదల

పవన్ కళ్యాణ్ ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ వచ్చేసింది 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 05, 2023
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా మీద అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుండి గ్లింప్స్ రిలీజైంది. ఈ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓజీ నుండి నటుడు అర్జున్ దాస్ లుక్ బయటకు వచ్చింది. అర్జున్ దాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ ని విడుదల చేశారు. ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి ఇతర కీలకపాత్రలో కనిపిస్తున్న ఓజీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్