Page Loader
Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌తో అర్జున్ దాస్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
పవన్‌కళ్యాణ్‌తో అర్జున్ దాస్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌తో అర్జున్ దాస్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ' ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా సిద్ధమవుతోంది. కోలీవుడ్ స్టార్ అర్జున్ దాస్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణలో భాగంగా పవన్ కల్యాణ్‌తో కలిసి తీసుకున్న ఫోటోలను అర్జున్ దాస్ అభిమానులతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో మళ్లీ మరో సినిమా చేయాలనే ఆశ వ్యక్తం చేశారు. అర్జున్ దాస్ తన పోస్ట్‌లో, "పవన్ కల్యాణ్ గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో కలిసి పని చేసిన ప్రతి రోజు నాకు మరిచిపోలేని అనుభవం. షూటింగ్ సమయంలో మీ బిజీ షెడ్యూల్ మధ్య నేను కోరిన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు.

Details

సెప్టెంబర్ 25న రిలీజ్

మీరు చర్చించిన గొప్ప విషయాలు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. ఈ క్షణాలు నా జీవితంలో చిరకాలం నిలిచి ఉంటాయి. మళ్ళీ మీతో కలిసి సినిమా చేయాలని ఆశిస్తున్నానని చెప్పారు. వీరిద్దరూ కలిసి సెల్ఫీకి పోజు ఇచ్చారు. ప్రస్తుతం 'ఓజీ' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇందులో ఇప్పటి వరకు చూడని శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా ఉన్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేపాయి. ముఖ్యంగా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన 'ఓజీ' గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.