అర్థమయ్యిందా అరుణ్ కుమార్ ట్రైలర్: కార్పోరేటు సిస్టమ్ కు బలైన యువకుడి కథ
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా నుండి సరికొత్త వెబ్ ఫిలిమ్ వచ్చేస్తోంది. అర్థమయ్యిందా అరుణ్ కుమార్ టైటిల్ తో కార్పోరేటు కంపెనీలో పనిచేసే కుర్రాడి కథను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ ఫిలిమ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. పల్లెటూర్లో చదువుకున్న కుర్రాడు అరుణ్ కుమార్, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో ఇంటర్న్ షిప్ చేయడానికి వెళ్తున్నట్టుగా చూపించారు. ఆ తర్వాత ఆఫీసులో ఇంటర్న్ గా అతను పడే తిప్పలు, ఎంప్లాయిస్ అతన్ని పెట్టే ఇబ్బందులు చూపించారు. ఇందులోనే అతన్ని ఇష్టపడే హీరోయిన్ పాత్రని పరిచయం చేసారు. ట్రైలర్ చూస్తుంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
జూన్ 30నుండి స్ట్రీమింగ్
లవ్, రొమాన్స్, కార్పోరేట్ కల్చర్, కామెడీ అన్నింటితో ట్రైలర్ ని నింపేసారు. హీరోయిన్ అనన్య క్యూట్ నెస్, తేజస్వి మదివాడ్ హాట్ నెస్ కలిసి ట్రైలర్ ను ఆసక్తిగా మార్చేసాయి. ఆహా ఒరిజినల్ గా వస్తున్న ఈ వెబ్ ఫిలిమ్ ని జొనాథన్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేసారు. జూన్ 30వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించేసారు. గతంలో హర్షిత్ రెడ్డి నటించిన మెయిల్, తరగతి గది దాటి వెబ్ ఫిలిమ్స్ కూడా ఆహాలోనే రిలీజ్ అయ్యాయి. వీటికి యూత్ నుండి మంచి స్పందన వచ్చింది. మరి అదే కోవలో అర్థమయ్యిందా అరుణ్ కుమార్ ఉంటుందేమో చూడాలి.