అర్థమయ్యిందా అరుణ్ కుమార్ పేరుతో ఆహాలో కొత్త సిరీస్ మొదలు; ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగువారికి దగ్గరైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో సరికొత్త కంటెంట్ వస్తోంది. ఇటీవల పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి నటించిన సత్తిగాని రెండెకరాలు అనే వెబ్ ఫిలిమ్ రిలీజైంది.
ఈ ఫిలిమ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో కొత్త కాన్సెప్టుతో వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
కార్పోరేట్ సంస్థలో పనిచేసే కుర్రాడి కథను, ఫ్రస్ట్రేషన్ ను, అసహనాన్ని, అమాయకత్వాన్ని, అల్లరిని అర్థమయ్యిందా అరుణ్ కుమార్ అనే పేరుతో సిరీస్ గా తీసుకువస్తున్నారు.
ఈ సిరీస్ తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజే రిలీజ్ చేసారు. కార్పోరేట్ ఉద్యోగం చేస్తూ, ఆ సంకెళ్లలో బంధీగా మారినట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తీర్చిదిద్దారు.
Details
కార్పోరేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తి కథ
జాబ్ చేయడానికి అమలాపురం నుండి హైదరాబాద్ వచ్చిన అరుణ్ కుమార్, కార్పోరేట్ కంపెనీలో ఇమడలేక ఎలాంటి అవస్థలు పడ్డాడు. అక్కడ ఉండే రాజకీయాలు, స్వార్థాలు అతనితో ఎలా ఆడుకున్నాయనే ఈ సిరీస్ కథగా ఉండబోతుందని ఆహా వెల్లడి చేసింది.
ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలో హర్షిత్ రెడ్డి నటిస్తున్నారు. హీరోయిన్లుగా అనన్య, తేజస్వి మదివాడ కనిపించనున్నారు.
జోనాథన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, పూర్తిగా నవ్వులు పంచేదిగా ఉండనుందని సమాచారం. ఈ సిరీస్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా వెల్లడి చేయలేదు.