
నాగ చైతన్య రీసెంట్ రిలీజ్ కస్టడీ ఓటీటీలోకి వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నాగ చైతన్య, క్రితి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన కస్టడీ చిత్రం మే 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన ఈ చిత్రం, రెండు భాషల్లోనూ ఒకేరోజున విడుదలైంది.
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రిలీజ్ కు ముందు మంచి బజ్ ఏర్పడింది. పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నాగ చైతన్య కొత్తగా కనిపించబోతున్నాడని అనుకున్నారు.
అయితే సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఫలితంగా నాగ చైతన్య ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. ప్రస్తుతం కస్టడీ సినిమా, ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.
Details
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్?
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ 9వ తేదీ నుండి కస్టడీ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. తెలుగు, తమిళం భాషలతో పాటు కన్నడ, మళయాలం భాషల్లో అందుబాటులో ఉండనుందని సమాచారం.
కస్టడీ కథ ఏంటంటే:
సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ శివ(నాగ చైతన్య), రేవతి(క్రితి శెట్టి)ని ప్రేమిస్తాడు. రేవతికి శివ అంటే చాలా ఇష్టం. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కులాలు వేరైన కారణంగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు.
ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుండగా, సడెన్ గా రాజు(అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్(సంపత్ రాజ్) లను శివ అరెస్ట్ చేయాల్సి వస్తుంది.
అరెస్ట్ జరిగిన తర్వాత రాజును చంపడానికి పోలీసు బలగాలు ప్రయత్నం చేస్తుంటాయి. అసలు వాళ్ళెందుకు చంపాలనుకున్నారనేదే కథ