Page Loader
మళ్ళీ పెళ్ళి ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్: ఒకేసారి రెండు ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ 
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మళ్ళీ పెళ్ళి

మళ్ళీ పెళ్ళి ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్: ఒకేసారి రెండు ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 21, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్ర జంటగా వచ్చిన మళ్ళీ పెళ్ళి చిత్రం, మే 26న థియేటర్లలో రిలీజైంది. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని సినిమా బృందంతో పాటు ట్రేడ్ వర్గాలు ఊహించాయి. కానీ అనుకోని విధంగా మొదటి షో పూర్తయ్యే సమయానికి సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది. థియేటర్లలో ఆకట్టుకోలేక పోయిన మళ్ళీ పెళ్ళి, ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఒకేరోజున రెండు ఓటీటీ ఛానల్స్ లో మళ్ళీ పెళ్ళి స్ట్రీమింగ్ అవనుంది.

Details

నిజ జీవిత సంఘటనలతో సినిమా 

అటు ఆహా, ఇటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 23వ తేదీ నుండి మళ్ళీ పెళ్ళి సినిమా, స్ట్రీమింగ్ అవనుంది. నరేష్, పవిత్రా లోకేష్ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనలు ఈ సినిమాలో ఉన్నాయని, నరేష్, పవిత్రల బంధం గురించి వైరల్ గా మారిన వార్తలు ఈ సినిమాలో ఉన్నాయని సినిమా చూసిన వాళ్ళు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ కృష్ణ మువీస్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమాను స్వయంగా తానే నిర్మించారు నరేష్. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమాకు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు.