NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీ రివ్యూ: అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా? 
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీ రివ్యూ: అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా? 
    అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ రివ్యూ

    ఓటీటీ రివ్యూ: అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 30, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలోకి అర్థమయ్యిందా అరుణ్ కుమార్ టైటిల్ తో వెబ్ సిరీస్ ఈరోజు విడుదలైంది.

    హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

    కథ:

    అమలాపురంలో ఉండే అరుణ్ కుమార్(హర్షిత్ రెడ్డి) కు ఆశలు ఎక్కువ. సిటీ వెళ్ళి జాబ్ చేసి మంచి పొజిషన్ లో స్థిరపడాలని అనుకుంటాడు. ఆ ఇంట్రెస్ట్ తోనే తండ్రి వద్దని చెప్పినా హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ కంపెనీలో ఇంటర్న్ గా చేరతాడు.

    ఆఫీసులో టీమ్ లీడర్ జై(ప్రవీణ్), అరుణ్ కుమార్ ని ఇబ్బంది పెడుతుంటాడు. అది భరించలేక మరో టీమ్ లీడర్ షాలిని(తేజస్వి మదివాడ) టీమ్ లోకి వెళ్ళిపోతాడు అరుణ్.

    Details

    సిటీలో జాబ్ చేసే వారికి నచ్చే అరుణ్ కుమార్ 

    షాలినితో అరుణ్ కుమార్ చాలా సాన్నిహిత్యంగా ఉంటాడు. అలా ఉండటం పల్లవి(అనన్య)కు నచ్చదు. ఎందుకంటే అరుణ్ కుమార్ ను అనన్య ఇష్టపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి నడుమ అరుణ్ పరిస్థితి ఏమయ్యిందన్నదే కథ.

    పల్లెటూరి నుండి సిటీకి జాబ్ చేయడం కోసం వచ్చిన వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కార్పోరేట్ ఆఫీసుల్లో రాజకీయాలు భరించలేక ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనిపించడం, అమ్మకు బాగోలేకపోతే కూడా సెలవు దొరక్కపోవడం వంటి సీన్లు బాగా కనెక్ట్ అవుతాయి.

    కాకపోతే ఈ సిరీస్ లో అరుణ్ కుమార్, పల్లవి మధ్య లవ్ ట్రాక్ ని సరిగ్గా చూపించలేదు. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్టు చూపించకపోవడంతో, పల్లవి జాబ్ మానేసి వెళ్ళిపోతుందన్న టైమ్ లో ఫీల్ రాదు.

    Details

    ప్రధాన పాత్రల మధ్య మిస్సయిన లవ్ ఎమోషన్ 

    తేజస్వి మదివాడ అందంగా కనిపించింది. ఆఫీసుల్లో పడే ఇబ్బందులను బాగానే చూపించినప్పటికీ కొన్ని చోట్ల మరీ ఓవర్ గా చూపించారేమో అనిపిస్తుంది.

    హీరో పాత్ర స్వభావం సరిగ్గా అర్థం కాకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య. హీరో పాత్ర ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటాడు. దానివల్ల కనెక్టివిటీ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది.

    ఇక టెక్నికల్ విషయాలకు వస్తే అజయ్ అరసాడ అందించిన సంగీతం బాగుంది. అమర్ దీప్ కెమెరా పనితనం అందరికీ నచ్చుతుంది.

    సిరీస్ లో 5ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి, కాకపోతే మరో సీజన్ ఉంటుందని చూపించారు. ప్రధాన పాత్రల మధ్య లవ్ ఎమోషన్ ని డైరెక్టర్ జొనాథన్ ఎడ్వర్డ్ బాగా పండించి ఉంటే సిరీస్ మరింత కనెక్ట్ అయ్యేది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఓటిటి

    హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందన్న దర్శకుడు రవిబాబు  తెలుగు సినిమా
    ఓటీటీ: అసలు మూవీ రివ్యూ: రవిబాబు మార్క్ పనిచేసిందా?  మూవీ రివ్యూ
    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే  తెలుగు సినిమా
    ఏప్రిల్ చివర్లో ఓటీటీలో సందడి చేయనున్న సిరీస్ లు  సినిమా

    సినిమా

    #BoyapatiRapo: పొలాల్లో మంచం మీద కూర్చుని రిలీజ్ డేట్ చెప్పేసిన రామ్ పోతినేని  తెలుగు సినిమా
    దర్శకుల ఫ్యాక్టరీగా జబర్దస్త్: సాయి కుమార్ తో సినిమాను రెడీ చేస్తున్న కమెడియన్  టెలివిజన్
    గేమ్ ఛేంజర్ కోసం రెడీ అవుతున్న రామ్ చరణ్: షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడంటే?  రామ్ చరణ్
    నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు: చైతన్ కృష్ణ 'బ్రీత్' మూవీ టీజర్ విడుదల  టీజర్

    తెలుగు సినిమా

    ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే?  ప్రభాస్
    గుంటూరు కారం దారిలోనే ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్: పూజా హెగ్డే ఔట్?  సినిమా
    అక్కినేని హీరో కోసం కీర్తి సురేష్: ఈసారి విజయం ఖాయమేనా?  సినిమా
    రష్మికను మేనేజర్ మోసం చేశాడనే పుకార్లపై క్లారిటీ ఇదిగో  రష్మిక మందన్న
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025