Asha Bhosle: ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని భారంగా భావిస్తున్నారు.. నేను ఒంటరిగా ముగ్గురు పిల్లల్ని పెంచాను: ఆశాభోంస్లే
సింగర్ ఆశాభోంస్లే రోజురోజుకి పెరుగుతున్న విడాకుల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌తో జరిగిన చర్చలో, యువతీ యువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారని చెప్పారు. "నా భర్తపై నాకు కోపం వచ్చినప్పుడు, నేను మా అమ్మ దగ్గరకు వెళ్లి కొన్ని రోజుల పాటు ఉండిపోయేదాన్ని. కానీ విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం ప్రతి నెలా విడాకులు తీసుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ఎందుకు జరుగుతుంది?" అని ఆమె రవిశంకర్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రవిశంకర్ సమాధానంగా, "మీకు దేవుడిపై నమ్మకం ఉంది, అలాగే కష్టాలను తట్టుకునే శక్తి కూడా ఉంది. కానీ నేటి తరానికి సహనం తగ్గిపోయింది" అన్నారు.
భర్త చనిపోయిన తర్వాత కూడా,నేను అన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించా: ఆశాభోంస్లే
"నేను సినిమా పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. నా కెరీర్‌లో ఎన్నో మందిని చూశాను. గతంలో,ప్రస్తుత తరంతో పోలిస్తే,వారు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయలేదు.యువతీ యువకుల మధ్య ప్రేమ చాలా త్వరగా ముగుస్తోంది,ఇది విడాకుల పెరుగుదలకు ప్రధాన కారణం.ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని భారంగా భావిస్తున్నారు.నేను 10 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత,నా కెరీర్‌తో పాటు ముగ్గురు పిల్లలను పెంచి,వారికి వివాహాలు చేశా.నా భర్త చనిపోయిన తర్వాత కూడా,నేను అన్ని బాధ్యతలను విజయవంతంగా ఒంటరిగానే నిర్వర్తించాను.నా పిల్లల చదువుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎంతో సహనంతో వ్యవహరించా" అని ఆశాభోంస్లే చెప్పారు.