Ashu Reddy: పెళ్లి పేరుతో మోసం.. ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ నటి అషు రెడ్డి ఘాటుగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్కు చెందిన యెనుముల సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషు రెడ్డి మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
వివరాలు
తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం
ఈ క్రమంలో రూ.9.35 కోట్ల విలువైన నగదు, బంగారం, ఫ్లాట్లు, వాహనాలను తన పేరుపై రిజిస్టర్ చేయించుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని అషు రెడ్డి స్పష్టం చేస్తూ, తనపై తప్పుడు ప్రచారం కొనసాగితే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.