Page Loader
Raayan: తెలుగులో ధనుష్ "రాయన్" ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ సంస్థ
తెలుగులో ధనుష్ "రాయన్" ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ సంస్థ

Raayan: తెలుగులో ధనుష్ "రాయన్" ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ సంస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
May 10, 2024
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో 'ధనుష్' హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహించిన సాలిడ్ యాక్షన్ చిత్రం "రాయన్". కాళిదాస్ జయరామ్‌తో పాటు సందీప్ కిషన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ధనుష్‌కి 50వ సినిమా. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.కాగా,ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 13న విడుదల కానుంది. తాజా అప్‌డేట్ ప్రకారం,ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది. మేకర్స్ ఇప్పటికే మొదటి సింగిల్,తల వంచి ఎరగాడే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకి ఆస్కార్-విజేత AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన ట్వీట్