
40ఏళ్ల వయస్సులో త్రిషకి పెళ్లి మీద ఆసక్తి పుట్టిందట!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించి, ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను చేసింది.
వయసు పెరుగుతున్న కొద్ది తన అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది.
1999లో జోడి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా ఎంట్రీ ఇచ్చిన త్రిష, 2002లో హీరోయిన్‌గా తమిళ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత వరుసగా సౌత్ ఇండియా అన్ని భాషల్లో నటిస్తూ అగ్ర నటి స్థాయికి ఎదిగింది. త్రిషపై చాలాసార్లు ప్రేమ వదంతులు వచ్చాయి. తాజాగా ఆమెకు పెళ్లిపై దృష్టి మళ్లినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
Details
విజయ్ సరసన లియో చిత్రంలో నటిస్తున్న విజయ్
త్రిష స్నేహితులు కొందరు పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనతో జీవితాంతం సంతోషంగా కలిసి పయనించే వ్యక్తి కనపడితేనే పెళ్లి చేసుకోవాలని త్రిష అనుకున్నట్లు ఆమెతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్‌లో వరుసగా త్రిష పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు. దీంతో ఆమెకు పెళ్లిపై ధ్యాస పుట్టిందా..? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం త్రిష నటుడు విజయ్ సరసన లియో చిత్రంలో నటించారు.