David Warner: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పుష్ప - 2లో నటిస్తున్నారా?
క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే, సిక్సులు, బౌండరీలతో ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్ ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. క్రికెట్ మాత్రమే కాకుండా మ్యాచ్ సమయంలో చేసే డ్యాన్స్‌లు చేస్తు అభిమానులను అలరిస్తుంటాడు. ఇక వార్నర్ ఫ్యామిలీతో కలిసి చేస్తున్న రీల్స్ ఇప్పటికే మిలియన్ వ్యూస్‌ని అందుకున్నాయి. ముఖ్యంగా పుష్ప యాక్టింగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ చిత్రాలకు సంబంధించి తెలుగు సినిమాల డైలాగ్స్, సాంగ్స్‌తో సోషియల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందాడు.
డాన్స్‌లతో అభిమానులను సంపాదించుకున్న వార్నర్
తాజాగా క్రికెట్‌కు స్వస్తి పలికిన వార్నర్ తాజా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వార్నర్ 'పుష్ప 2'లో నటిస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గన్ పట్టుకున్న వార్నర్ ఫొటో బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వాస్తవంగా వార్నర్ ఒక తెలుగు సినిమాకు సైన్ చేశాడని తెలుస్తోంది. ఇందులో ఏమాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.