LOADING...
Avatar 3 Ott: అవతార్ 3 ఓటీటీ రిలీజ్.. కానీ ఫ్రీ కాదు! అసలు విషయం ఇదే
అవతార్ 3 ఓటీటీ రిలీజ్.. కానీ ఫ్రీ కాదు! అసలు విషయం ఇదే

Avatar 3 Ott: అవతార్ 3 ఓటీటీ రిలీజ్.. కానీ ఫ్రీ కాదు! అసలు విషయం ఇదే

వ్రాసిన వారు Moogati Shabari
Mar 31, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను జేమ్స్ కామెరాన్ సృష్టించారు. ఆయన రూపొందించిన అద్భుత విజువల్ చిత్రం "అవతార్: ఫైర్ అండ్ యాష్" ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అంతే కాకుండా, తన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుదలపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

వివరాలు 

అవతార్ 3 ఓటీటీ విడుదల

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ విజువల్ స్పెక్టాకిల్ ఇవాళ (మార్చి 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది సాధారణ స్ట్రీమింగ్ కాదు. "అవతార్ 3" ప్రస్తుతం కేవలం డిజిటల్ పర్చేజ్ లేదా రెంట్ (PVOD) విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో లేదా ఆపిల్ టీవీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొంత మొత్తాన్ని చెల్లించి ఈ సినిమాను రెంట్ తీసుకుని చూడాలి. మీకు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ, ఈ సినిమాను చూడటానికి అదనంగా చెల్లించాల్సిందే.

వివరాలు 

ఫ్రీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సబ్‌స్క్రిప్షన్‌తో ఫ్రీగా ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సమాచారం ప్రకారం, అంతర్జాతీయంగా ఈ సినిమా డిస్నీలో స్ట్రీమింగ్ కానుంది. భారత్‌లో మాత్రం జియోహాట్‌స్టార్ ద్వారా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. సాధారణంగా డిజిటల్ రెంట్ ప్రారంభమైన తర్వాత 4 నుంచి 8 వారాల గడువు తర్వాతే సాధారణ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రకారం చూస్తే, ఏప్రిల్ చివరి వారంలో లేదా మే 2026 మొదటి వారంలో ఈ సినిమా జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమాను చూడవచ్చు.

Advertisement

వివరాలు 

బాక్సాఫీస్ రికార్డులు ఇవే..

"అవతార్ 2" తరహాలోనే "అవతార్ 3" కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.48 బిలియన్ డాలర్లు (సుమారు రూ.13,964 కోట్లు) వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, 98వ ఆస్కార్ అవార్డుల్లో "బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్" విభాగంలో అవార్డు గెలుచుకోవడం ఈ సినిమా సాంకేతిక నాణ్యతకు నిదర్శనం. మూడో భాగంలో కామెరాన్ పండోరా గ్రహంలోని మరో కొత్త కోణాన్ని చూపించారు. జేక్ సల్లీ, నేతిరి కుటుంబం ఈసారి అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే 'యాష్ పీపుల్' అనే కొత్త తెగను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు చూసిన నావి తెగలు శాంత స్వభావంతో ఉంటే, ఈ కొత్త తెగ మాత్రం చాలా దూకుడుగా ఉంటుంది.

Advertisement