Baahubali-3 : 'బాహుబలి-3'పై అధికారిక సంకేతం.. అభిమానుల్లో కొత్త ఉత్సాహం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటింది. తాజాగా 'బాహుబలి: ది టార్చ్ బేరర్' నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ వీడియోలో ప్రభాస్, రానా, అనుష్క కలిసి 'బాహుబలి-3' రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. "ఈ ప్రకటనను ప్రపంచం ఊహించలేదు. మీ అందరి కోసం 'బాహుబలి' మూడో భాగం తీసుకురానున్నాం" అంటూ వారు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న ప్రభాస్, రానా వీడియో..
Bahubali 3 is Official now 🥳🥳🥳🥳 confirmed by Prabhas anna, Rana and Sweety #Prabhas #Bahubali3 pic.twitter.com/wo0qW6JCyF
— 🍿 (@Mithabhashi__) June 25, 2026
వివరాలు
అనుష్క గురించి ఆసక్తికర విషయాలు..
ఈ సందర్భంగా ప్రభాస్ అనుష్క గురించి ఓ ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. అనుష్క నవ్వడం ప్రారంభిస్తే కనీసం 40 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందని చెప్పారు. అందుకే ఆమె ప్రతిరోజూ షూటింగ్‌కు వచ్చే ముందు ఈరోజు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నవ్వకూడదని అనుకునేదని తెలిపారు. ఒకసారి నవ్వడం మొదలైతే షూటింగ్‌కు అంతరాయం ఏర్పడుతుందని, భారీ వ్యయంతో నిర్మించిన సెట్‌కు నిర్మాతకు నష్టం కలగొచ్చనే భావనతో ఆమె జాగ్రత్త పడేదని సరదాగా వివరించారు. మరోవైపు సత్యరాజ్ మాట్లాడుతూ, సినిమా సెట్స్‌లో విస్తారంగా కాస్ట్యూమ్స్‌ను సిద్ధం చేసి ఉంచేవారని, ఎటు చూసినా దుస్తులే కనిపించేంత భారీ ఏర్పాట్లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇక 'బాహుబలి-3' వస్తోందన్న ప్రకటనతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనుష్క గురించి వైరల్ అవుతున్న వీడియో..
Prabhas anna Emotional #Prabhas #BaahubaliTheTorchbearerpic.twitter.com/Kutgn9O3yP
— chaituedits7 (@Chaitu_edits7) June 25, 2026
వివరాలు
మరోసారి చరిత్ర తిరగరాయనున్న జక్కన్న..
ఇదిలా ఉండగా, గతంలో 'ఆర్‌ఆర్ఆర్' సినిమా ప్రచార కార్యక్రమాల్లో రాజమౌళి 'బాహుబలి' మూడో భాగంపై స్పందించారు. వెంటనే కాకపోయినా, భవిష్యత్తులో తప్పకుండా 'బాహుబలి-3'ను రూపొందించే అవకాశం ఉందని ఆయన అప్పట్లో వెల్లడించారు. ఇప్పుడు నటీనటులు కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేయడంతో, రాజమౌళి ప్రస్తుతం రూపొందిస్తున్న 'వారణాసి' ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత 'బాహుబలి-3' పనులు ప్రారంభమవుతాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తొలి రెండు భాగాలతో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సిరీస్, మూడో భాగంతో మరోసారి చరిత్రను తిరగరాస్తుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న రాజమౌళి వీడియో..
Goosebumps stuff followed by #Baahubali3 announcement from the Baahubali himself 😭#BaahubaliTheTorchbearer pic.twitter.com/7MSkkp8WYd
— Krishna (@The_Tribbiani) June 25, 2026