Baahubali: The Epic :రాజమౌళి కొత్త మాస్టర్ ప్లాన్.. AI టెక్నాలజీతో బాహుబలి యూనివర్స్‌కి కొత్త రూపం
ఈ వార్తాకథనం ఏంటి
భారత సినీ రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన "బాహుబలి" సిరీస్ మళ్లీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. "బాహుబలి" తొలి రెండు భాగాలను కలిపి, "బాహుబలి: ది ఎపిక్" పేరుతో ఈ అక్టోబర్ 31న మరోసారి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే టీజర్,మొదటి ట్రైలర్‌ను విడుదల చేసిన బృందం, ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడానికి సిద్ధమవుతోంది. తాజా టాక్ ప్రకారం, దర్శకుడు రాజమౌళి తన కొత్త ఆలోచనతో "బాహుబలి యూనివర్స్"ను మరోసారి కొత్త కోణంలో మలచేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, ఈసారి "బాహుబలి: ది ఎపిక్"ను లైవ్ యాక్షన్ కాకుండా ఆధునిక AI టెక్నాలజీతో రూపొందించిన యానిమేటెడ్ ఫార్మాట్‌లో తీసుకురావాలనే ఆలోచన రాజమౌళి టీమ్‌లో కొనసాగుతోంది.
వివరాలు
డెవలప్‌మెంట్ దశలో "యానిమేటెడ్ వెర్షన్ ఆఫ్ బాహుబలి 3"
మహిష్మతి సామ్రాజ్యాన్ని భవిష్యత్తు ప్రపంచం తరహాలో చూపించేందుకు డిజైన్ పనులు వేగంగా సాగుతున్నాయని చెబుతున్నారు. "యానిమేటెడ్ వెర్షన్ ఆఫ్ బాహుబలి 3" ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉందని, నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి సారించారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడో భాగాన్ని లైవ్ యాక్షన్ రూపంలో రూపొందించడం ప్రస్తుతం సవాలుగా మారింది. ప్రభాస్ ఇప్పటికే "కల్కి 2898 AD", "సలార్ 2" వంటి భారీ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు. అనుష్క శెట్టి సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. రానా దగ్గుబాటి పాత్ర (భల్లాలదేవ) గత భాగంలోనే ముగిసింది.
వివరాలు
భారత సినీ చరిత్రలో మరోసారి సాంకేతిక విప్లవానికి నాంది
ఈ పరిస్థితుల్లో లైవ్ యాక్షన్ కాస్టింగ్ కష్టం కావడంతో, రాజమౌళి AI + యానిమేషన్ ఫార్మాట్ వైపు మొగ్గు చూపి, "బాహుబలి యూనివర్స్"ను కొత్త తరం ప్రేక్షకుల కోసం పునర్‌రూపకల్పన చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇది నిజమైతే, "బాహుబలి: ది ఎపిక్" భారత సినీ చరిత్రలో మరోసారి సాంకేతిక విప్లవానికి నాంది పలికే అవకాశం ఉంది. రాజమౌళి దృష్టి, ఆయన సృజనాత్మక ఆలోచన ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షించడం ఖాయం.