బబుల్ గమ్ టీజర్: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా టీజర్ చూసారా?
ఈ వార్తాకథనం ఏంటి
యాంకర్ సుమ... పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటివరకు యాంకర్ గా చేసినవాళ్లు చాలామంది ఉండొచ్చు కానీ యాంకర్ అనే పదానికే పర్యాయపదంగా మారింది మాత్రం సుమ ఒక్కరే.
యాక్టర్ రాజీవ్ కనకాల సతీమణి అయిన సుమ కనకాల యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్నారు.
బబుల్ గమ్ అనే టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు.
అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన కృష్ణ అండ్ హిస్ లీల దర్శకుడు రవికాంత్ పేరేపు బబుల్ గమ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Details
డిసెంబర్ 29న థియేటర్లలోకి వస్తున్న బబుల్ గమ్
తాజాగా బబుల్ గమ్ చిత్ర టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే పూర్తి లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిందని అర్థమవుతోంది.
ఈ సినిమాలో రోషన్ కనకాల డీజే ఆపరేటర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే, ఈ టీజర్ లో లిప్ లాక్ సన్నివేశాలు కనిపించాయి.
యూత్ ని టార్గెట్ చేస్తూ బబుల్ గమ్ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.
మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న బబుల్ గమ్ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.
డిసెంబర్ 29వ తేదీన బబుల్ గమ్ సినిమా థియేటర్లలోకి వస్తుందని చిత్రబృందం తెలియజేసింది.