
రేప్ చేసి, చంపేస్తామని బేబీ నటికి బెదిరింపులు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లో బేబీ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతో విడుదలైన పది రోజులకే 70 కోట్ల మార్కుకు చేరువైంది.
ఈ సినిమాలో హీరో హీరయిన్లు వైష్ణవి, ఆనంద్, విరాజ్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసును దోచేశారు.
హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన కిరాక్ సీత పాత్ర కూడా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది.
బేబీ సినిమా తర్వాత తనకు వేధింపులు పెరిగాయని హీరోయిన్ వైష్ణవి ఫ్రెండ్‌గా నటించిన సీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
తనని కొందరు లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారనే విషయాన్ని కూడా బయటపెట్టింది.
Details
ప్రాబ్లమ్ ఉంటుందని డైరక్టర్ ముందే చెప్పాడు : సీత
ఓ ఈవెంట్ కు తాను వెళ్లి వస్తున్న సమయంలో కొందరు కుర్రాళ్లు వెంటబడ్డారని, తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఈ విషయం చెబితే పోలీసులకు కంప్లైంట్ చేయమని సలహా ఇచ్చారని, అయితే తాను అలా చేయలేదని సీత చెప్పారు.
కొందరైతే రేప్ చేసి, చంపేస్తామని బెదిరించారని, అయితే తన అడ్రస్ ను తెలుసుకోవడానికి కూడా చాలా ట్రై చేశారని, కానీ వీటన్నింటినీ తాను లైట్ తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
బేబీలో పాత్ర వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని డైరక్టర్ తనకు ముందే చెప్పారని కిరాక్ సీత్ పేర్కొన్నారు.