Page Loader
Mazaka: 'మజాకా' సినిమా నుండి బ్యాచిలర్స్‌ స్పెషల్‌ పాట విడుదల

Mazaka: 'మజాకా' సినిమా నుండి బ్యాచిలర్స్‌ స్పెషల్‌ పాట విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు సందీప్‌ కిషన్‌ ప్రధానపాత్రలో నటించిన 'మజాకా' చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. రీతూవర్మ కథానాయికగా నటించారు. రావు రమేశ్‌, అన్షు కీలక పాత్రలు పోషించారు. రాజేశ్‌ దండా, ఉమేశ్‌ కె.ఆర్‌.బన్సాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా, ఈ చిత్రంలోని "బ్యాచిలర్స్‌ స్పెషల్" పాటను విడుదల చేశారు. ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ధనుంజయ్‌ గాత్రం సమర్పించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకాభిమానులను అలరిస్తోంది.