Page Loader
బలగం ఖాతాలో మరో అవార్డ్: వైరల్ అవుతున్న ప్రియదర్శి కామెంట్
ఉక్రెయిన్ కు ఒనికో ఫిలిమ్ అవార్డ్స్ లో బెస్ట్ డ్రామా ఫీఛర్ గా నిలిచిన బలగం

బలగం ఖాతాలో మరో అవార్డ్: వైరల్ అవుతున్న ప్రియదర్శి కామెంట్

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 03, 2023
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్ కు ఒనికో ఫిలిమ్ అవార్డ్స్ ఉత్సవాల్లో బలగం సినిమాకు బెస్ట్ డ్రామా ఫీఛర్ ఫిలిమ్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఇది బలగం చిత్రానికి వరుసగా మూడవ అంతర్జాతీయ అవార్డు. ఇదివరకు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిలిమ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను అందుకుంది బలగం. తాజాగా మూడవ అవార్డు గెలుచుకోవడంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడంపై స్పందించిన హీరో ప్రియదర్శి, ఇంటగెలిచి రచ్చ గెలుస్తున్నాం అని ట్విట్టర్ లో కామెంట్ చేసాడు. మొత్తానికి బలగం దూకుడు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఓటీటీలో వచ్చాక కూడా థియేటర్లలో దూసుకుపోతున్న బలగం చిత్రం, మరిన్ని అంతర్జాతీయ అవార్డులు పొందే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బెస్ట్ డ్రామా ఫీఛర్ ఫిలిమ్ గా అవార్డు అందుకున్న బలగం