
బలగం చిత్రానికి అవార్డుల పంట: ఈసారి హీరో హీరోయిన్లకూ అవార్డ్ వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో రెండు, ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిలిమ్ అవార్డుల్లో ఒకటి పురస్కారాలు అందుకున్న బలగం, తాజాగా ఒకేసారి 4అవార్డులు సొంతం చేసుకుంది.
ది వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ అందించిన అవార్డుల్లో నాలుగు విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.
బెస్ట్ ఫీఛర్ డైరెక్టర్ విభాగంలో వేణు యెల్దండి
బెస్ట్ యాక్టర్ గా ప్రియదర్శి
బెస్ట్ యాక్ట్రెస్ గా కావ్యా కళ్యాణ్ రామ్ అవార్డులు అందుకోవడంతో పాటు బెస్ట్ నేరేటివ్ ఫీఛర్ గా మరో అవార్డును సొంతం చేసుకుంది బలగం.
ఈ విషయాన్ని నిర్మాత హర్షిత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలియజేసాడు. దర్శకుడు వేణు యెల్దండి, అవార్డులు అందజేసిన వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ నిర్వాహకులకు దన్యవాదాలు తెలియజేసాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గ్లోబల్ లెవెల్లో దుమ్ము దులుపుతున్న బలగం
#Balagam does it big again! 🤩🔥
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) April 3, 2023
Thanks to Washington DC International Cinema Festival for recognizing our efforts! ❤️@priyadarshi_i @kavyakalyanram @dopvenu #Bheemsceciroleo @LyricsShyam@DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka @WallsAndTrends pic.twitter.com/JC47T5cokj