Page Loader
NBK 109 : డాకు మహారాజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 'బాలయ్య' స్పెషల్ సాంగ్ రిలీజ్
డాకు మహారాజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 'బాలయ్య' స్పెషల్ సాంగ్ రిలీజ్

NBK 109 : డాకు మహారాజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 'బాలయ్య' స్పెషల్ సాంగ్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా 'డాకు మహారాజ్' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ గతంలో చూడని కొత్త అవతారంలో కనిపించనున్నారు. కథానాయికలుగా శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 'డాకు మహారాజ్' విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు బాబీ, నిర్మాతలు పలు ఇంటర్వ్యూలలో 'డాకు మహారాజ్' విశేషాలను పంచుకుంటున్నారు.

Details

జనవరి 4న రిలీజ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల కాగా, మూడవ సాంగ్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 4న డల్లాస్‌లో జరుగనున్న 'డాకు మహారాజ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మూడవ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ గురించి దర్శకుడు బాబీ మాట్లాడుతూ, నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా ఉండేలా లిరిక్స్‌పై చాలా శ్రద్ధ తీసుకున్నామని, ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బాలకృష్ణతో కలిసి అలరించనున్నారు. 'షేక్... షేక్... షేక్ ఆడిస్తాను' అంటూ తమన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.