LOADING...
Balakrishna : ఒకే వేదికపై చరణ్ - బాలయ్య..? ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్
ఒకే వేదికపై చరణ్ - బాలయ్య..? ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

Balakrishna : ఒకే వేదికపై చరణ్ - బాలయ్య..? ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

వ్రాసిన వారు Moogati Shabari
May 21, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రం జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా రామ్ చరణ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంతో మూవీ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో మొత్తం ఎనిమిది ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్రణాళికలు రూపొందించింది.

వివరాలు

పరిశ్రమలో అదొక ఆనవాయితీ..

ఈ నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు 'పెద్ది' యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 'పెద్ది' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇదే నిర్మాణ సంస్థలో బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా కూడా రూపొందుతోంది. సాధారణంగా ఒకే నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న హీరోలు పరస్పరం ఒకరి సినిమా వేడుకలకు అతిథులుగా హాజరవడం పరిశ్రమలో కనిపించే ఆనవాయితీ.

వివరాలు

నందమూరి ఫ్యాన్స్ హంగామా..

ఇక ఇటీవల 'పెద్ది' నిర్మాత వెంకట సతీష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బాలకృష్ణను ఆహ్వానించే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంకేతాలు ఇచ్చారు. దీంతో నిర్మాతలు ఆహ్వానిస్తే బాలయ్య ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే, ఒకే వేదికపై రామ్ చరణ్ మరియు బాలకృష్ణ కనిపించడం మెగా, నందమూరి అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

Advertisement