Page Loader
భగవంత్ కేసరి మొదటి పాట: తెలంగాణ యాసలో ఆసక్తి రేపుతున్న బాలయ్య, శ్రీలీల డైలాగ్స్ 
భగవంత్ కేసరి నుండి గణేష్ ఆంథెమ్ ప్రోమో విడుదల

భగవంత్ కేసరి మొదటి పాట: తెలంగాణ యాసలో ఆసక్తి రేపుతున్న బాలయ్య, శ్రీలీల డైలాగ్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 30, 2023
06:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి నుండి మొదటి పాట ప్రోమోను రిలీజ్ చేస్తామని చిత్రబృందం నిన్న ప్రకటించింది. అన్నట్లుగానే ఈరోజు గణేష్ ఆంథెమ్ ప్రోమోను రిలీజ్ చేసారు. 63సెకన్ల నిడివితో ఉన్న ఈ ప్రోమోలో బాలయ్య, శ్రీలీల డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. తెలంగాణ యాసలో, బిడ్డా ఆన్తలేదు, సప్పుడు జర గట్టిగ జెయ్ మను అని బాలయ్య అంటే, తీసిపక్కన పెట్టండ్రా మీ తీన్మారు, మా చిచ్చా వచ్చిండు, కొట్టర కొట్టు సౌమారు అనే డైలాగ్ తో శ్రీలీల అదరగొట్టింది. ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్