
Balakrishna : నందమూరి బాలకృష్ణపై తమిళ నటి సంచలన ఆరోపణలు.. హోటల్లో క్యాస్టింగ్ కౌచ్
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణపై కోలీవుడ్ నటీమణి విచిత్ర సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్న తమిళ ఆర్టిస్ట్ విచిత్ర, నవంబర్ 21న జరిగిన ఎపిసోడ్'లో తన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన గురించి చెప్పాలని కోరారు.
దీనిపై స్పందించిన నటీ, 2000లో జరిగిన సంఘటన అంటూ వివరించారు. తానో తెలుగు సినిమాలో నటించానని, దురదృష్టవశాత్తు అదే లాస్ట్ సినిమా అన్నారు.
ఆ రోజు జరిగిన క్యాస్టింగ్ కౌచ్'ను, తాను మర్చిపోదామనుకున్నా గుండెల్లో ఇప్పటికే రగులుతూనే ఉందన్నారు.
సినిమా షూటింగ్'లో భాగంగా నన్ను ఓ 3 స్టార్ హోటల్'లో ఉంచారని, ఓ రోజు సాయంత్రం పార్టీలో భాగంగా ఆ సినిమా హీరోను కలిశానన్నారు.
details
ఆ టాప్ హీరో నన్ను గదిలోకి రమ్మని అడిగాడు : విచిత్ర
అప్పటికే ఆ హీరోకి నా పేరు తెలియదని, కానీ తన గదికి మాత్రం రమ్మని అడిగాడని విచిత్ర అన్నారు.
దీంతో ఒక్కసారిగా కంగుతిన్నానని, ఆ సమయంలో నాకేమి అర్థం కాలేదని, ఆ తర్వాత నా గదికి వెళ్లి పడుకున్నానని చెప్పారు.
ఆ తర్వాత రోజు నుంచి జరిగిన షూటింగ్'లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు నటి విచిత్ర తెలుగులో చేసిన ఏకైక సినిమా, భలేవాడివి బాసూ అని, అది 2001లో రిలీజ్ అయ్యిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరో బాలయ్యేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతుండటం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హోటల్లో క్యాస్టింగ్ కౌచ్
నందమూరి బాలకృష్జపై, నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు. #Balakrishna #Vichitra pic.twitter.com/w9DDCguiXj
— Actual India (@ActualIndia) November 22, 2023