Balayya - Boyapati : బాలయ్య - బోయపాటి కాంబో.. దసరా సందర్భంగా కొత్త అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో అంటే నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి.
ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ అన్నీ బాక్సీఫీస్ వద్ద అద్భుత కలెక్షన్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు ఒక్కొక్కటిగా భారీ విజయాలను సాధించాయి. దీంతో వీరిద్దరి కాంబో మరోసారి పట్టాలెక్కనుంది.
గతంలో ఈ కాంబోలో మరో ప్రాజెక్ట్ ఉంటుందని, అయితే అది అఖండ 2 కూడా వస్తుందని ప్రకటించారు.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక కొత్త సినిమా ప్రకటించారు.
Details
అక్టోబర్ 16న ఓపెనింగ్
ఈ కాంబోలో నాలుగవ సినిమాగా 'BB4' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్ విడుదల చేశారు.
తాజాగా ఈ దసరా పండగ సందర్భంగా, బాలయ్య బోయపాటి కాంబోకు సంబంధించి ఒక అప్డేట్ అందించారు.
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం అక్టోబర్ 16న జరగనుందని ప్రకటించారు.
షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. పోస్టర్లో 'BB4' అనే వర్కింగ్ టైటిల్ కనిపిస్తుండగా, వెనుక అమ్మవారి ఫోటోతో ఉంది. ఇది అఖండ 2 లేదా వేరే సినిమా అనేది తెలియాల్సి ఉంది.