
బాలయ్య, బోయపాటి కాంబో: అఖండ సీక్వెల్ ను పక్కనపెట్టి లెజెండ్ సీక్వెల్ రెడీ?
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు విజయాలను సాధిస్తూనే ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో బాలయ్య, బోయపాటి కాంబో ముందు వరుసలో ఉంటుంది.
ఇప్పటివరకు ఈ కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలన్నీ వెండితెర మీద వసూళ్ళ వర్షాన్ని కురిపించాయి.
అయితే మరోసారి బాలయ్య, బోయపాటి కాంబోలో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అఖండ రిలీజ్ అయిన సమయంలో వెల్లడి చేయడంతో, అఖండ సినిమాకు సీక్వెల్ రాబోతుందని అందరూ అనుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం, అఖండ సీక్వెల్ కాదు లెజెండ్ సినిమాకు సీక్వెల్ వస్తోందని తెలుస్తోంది. ఈ విషయమై బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10వ తేదీన అధికారిక సమాచారం రానుందని అంటున్నారు.
Details
అక్టోబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశం
లెజెండ్ సినిమా సీక్వెల్ కు కథను బోయపాటి రెడీ చేశాడని, బాలయ్యకు వినిపించాడనీ, కథ నచ్చడంతో బాలయ్య ఒప్పుకున్నారని వినిపిస్తోంది.
అక్టోబర్ నుండి లెజెండ్ సినిమా సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాతో బాలయ్య బిజీగా ఉన్నాడు. అటు రామ్ పోతినేని హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు బోయపాటి.
ఈ రెండు సినిమాలు దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల కానున్నాయని ఆల్రెడీ ప్రకటన వచ్చేసింది. అందువల్ల లెజెండ్ సినిమా సీక్వెల్ ను అక్టోబర్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.