NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Mokshagna: డిసెంబర్ మూడో వారం నుంచి మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్‌ షూటింగ్
    తదుపరి వార్తా కథనం
    Mokshagna: డిసెంబర్ మూడో వారం నుంచి మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్‌ షూటింగ్
    డిసెంబర్ మూడో వారం నుంచి మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్‌ షూటింగ్

    Mokshagna: డిసెంబర్ మూడో వారం నుంచి మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్‌ షూటింగ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 18, 2024
    02:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు, టాక్ షోలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల అయన సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

    ఈ నేపథ్యంలో, బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రేక్షకులు, అభిమానులు, టాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఒకపక్క , మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, స్టార్ హీరోగా మారడం చాలా త్వరగా జరిగింది.

    అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోలుగా టాలీవుడ్‌లో మంచి స్థానం సంపాదించుకున్నారు.

    ఈ నేపథ్యంలో, బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది.

    వివరాలు 

    సినిమా ఫస్ట్ లుక్ విడుదల

    మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో కాలం ఎదురు చూస్తున్న అభిమానులకు ఆనందాన్ని కలిగించడానికి, ఇప్పుడు ఈ ఎంట్రీ ఖరారు అయింది.

    హను-మాన్ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

    మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా, ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. క్యూట్ లుక్ లో, సింపుల్ గా నడుస్తూ చిన్న సింహం మాదిరి కనిపించిన మోక్షజ్ఞ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

    ఈ చిత్రం పురాణ ఇతిహాసాల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఎస్ ఎల్ వీ బ్యానర్ పై, సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

    వివరాలు 

    మోక్షజ్ఞ సరసన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్

    బాలయ్య తన కొడుకు సినిమా పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. డిసెంబర్ మూడవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

    బాలయ్య ఇటీవల స్క్రిప్ట్ విని, చాలా బాగా నచ్చిందని చెప్పినట్లు సమాచారం.ముఖ్యంగా సోషియో-ఫాంటసీ ఎలిమెంట్స్ మోక్షజ్ఞ క్యారెక్టర్ ఎలివేషన్స్ కూడా బాలకృష్ణకు నచ్చాయని చెప్తున్నారు.

    ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రశాంత్ వర్మ హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేక సెట్లు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

    ఈ ప్రాజెక్ట్ కూడా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతుంది.అలాగే, మోక్షజ్ఞ సరసన అటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

    ఈ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    టాలీవుడ్

    upcoming movies telugu: ఈ వారం చిన్న చిత్రాలదే సందడి.. ఇక ఓటీటీలో వచ్చే మూవీస్‌ ఇవే!  సినిమా
    Raja Saab: అక్టోబర్ 23 నుంచి 'రాజాసాబ్' వరుస అప్‌డేట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత  ప్రభాస్
    Viswam: ఓటీటీలోకి గోపిచంద్ మూవీ విశ్వం.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే? సినిమా
    #SDT18: ధైర్యం, ఆశ ఆధారంగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్! సాయి ధరమ్ తేజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025