LOADING...
Mega 158 : చిరంజీవి సినిమాకు హీరోయిన్ మార్పు.. హానీ రోజ్ స్థానంలో రచిత రామ్ ఎంపిక
చిరంజీవి సినిమాకు హీరోయిన్ మార్పు.. హానీ రోజ్ స్థానంలో రచిత రామ్ ఎంపిక

Mega 158 : చిరంజీవి సినిమాకు హీరోయిన్ మార్పు.. హానీ రోజ్ స్థానంలో రచిత రామ్ ఎంపిక

వ్రాసిన వారు Moogati Shabari
Jun 07, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మెగా 158'పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో జరిగిన మార్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొదటగా చిరంజీవి సరసన కథానాయికగా నటించేందుకు మలయాళ నటి హానీ రోజ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ఆమెకు మంచి పారితోషికం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే కొన్ని వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ కారణాల నేపథ్యంలో హానీ రోజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిన హనీ రోజ్..

అంతేకాకుండా ముందుగా తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. హానీ రోజ్ వైదొలగడంతో, చిరంజీవికి జోడీగా ఎవరు నటిస్తారనే అంశంపై మేకర్స్ పలు పేర్లను పరిశీలించారు. చివరకు కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రచిత రామ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే కన్నడలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్న రచిత రామ్, ఇప్పుడు మెగాస్టార్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడం విశేషంగా మారింది.

వివరాలు

బాబీ, చిరూ కాంబోలో మూవీ..

ఇక ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రను యువ నటి అనస్వర రాజన్ పోషిస్తోంది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ కొల్లి-చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో వేగంగా కొనసాగుతోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement