
ప్రఖ్యాత న్యూస్ ఛానల్ పై బండ్ల గణేష్ ఫైర్: బహిష్కరించాలని ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ మధ్య ట్విట్టర్ లో బండ్ల గణేష్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న సినిమా ఇండస్ట్రీలోని ఒకానొక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ, తలచుకుంటే భార్యభర్తల్ని, అన్నదమ్ముల్ని ఆ డైరెక్టర్ విడగొడతారని అన్నారు.
తాజాగా న్యూస్ ఛానల్ ని బహిష్కరించాలని బండ్ల గణేష్ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ బండ్ల గణేష్ ఏమన్నాడంటే, ఈ గ్రేట్ ఆంధ్ర వెంకీ గాడికి, వాడికి సంబంధించిన దానికి దయచేసి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.
సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలు మన తెలివితో మన కష్టంతో, మన రక్తాన్ని చెమటగా మార్చి పని చేసుకుని కళామతల్లి సేవలో ఉన్న మనందరం గ్రేట్ ఆంధ్రను బహిష్కరిద్దాం. వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.
Details
సినిమాని నమ్ముకున్న వాళ్ళ జోలికొస్తే రావొద్దని ట్వీట్
మన రివ్యూలు రాస్తే, మన మీద తప్పుగా రాస్తే, మన గురించి చౌకగా చీపుగా రాస్తే వాడి అంతు నేను చూస్తా అన్నాడు బండ్ల గణేష్. వాడు రాజకీయాల్లో ఎన్ని అయినా చేసుకోమను.. మనకు సంబంధం లేదు.
సినిమా పరిశ్రమపై, కళామతల్లి ముద్దు బిడ్డలపై, సినిమాని నమ్ముకుని బతుకుతున్న వాళ్లపై ఏమాత్రం రాసినా సహించేది లేదు.
దయచేసి గ్రేట్ ఆంధ్రను బహిష్కరించండి. ఈ పచ్చని మల్లె తోటలో ఈ గంజాయి మొక్కను పీకేద్దాం. కళామతల్లి నీడలో బ్రతుకుతూ, సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మన న్యూస్ ని గ్రేట్ ఆంధ్రకిస్తే మన తల్లిదండ్రులను, ఆత్మను మోసం చేసుకున్నట్టు.
Details
బహిష్కరించాలని డిమాండ్
ఇలాంటి గ్రేట్ ఆంధ్రాని మనం బహిష్కరించకపోతే మనకు మనం మోసం చేసుకున్నట్టే. నువ్వు రాజకీయంలో ఎవరినైనా తిట్టుకో.. ఎవరినైనా కొట్టుకో.. మాకు సంబంధం లేదు.
కానీ సినిమా వాళ్ళ జోలికి వచ్చావా? వెంకీ నీ పెంకి పగులుద్ది అని పెద్ద ట్వీట్ చేసారు బండ్ల గణేష్. ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్న ఈట్వీటుపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బండ్ల గణేష్ ట్వీట్
ఈ గ్రేట్ ఆంధ్ర వెంకీ గాడికి వాడికి సంబంధించిన దానికి దయచేసి ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు. సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలు మన తెలివితో మన కష్టంతో మన రక్తాన్ని చమటగా మార్చి పని చేసుకుని కళ్ళమ్మ తల్లి సేవలో ఉన్న మనందరం గ్రేట్ ఆంధ్రను బహిష్కరిద్దాం. వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు. మన…
— BANDLA GANESH. (@ganeshbandla) May 29, 2023