Bandla Ganesh: బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 16, 2026
04:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.