Loading...
Bandla Ganesh Son : బండ్ల గణేష్‌ కొడుకు హితేష్‌ హీరోగా ఎంట్రీ? వైరల్‌గా మారిన డ్యాన్స్‌ వీడియోలు
బండ్ల గణేష్‌ కొడుకు హితేష్‌ హీరోగా ఎంట్రీ? వైరల్‌గా మారిన డ్యాన్స్‌ వీడియోలు

Bandla Ganesh Son : బండ్ల గణేష్‌ కొడుకు హితేష్‌ హీరోగా ఎంట్రీ? వైరల్‌గా మారిన డ్యాన్స్‌ వీడియోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ పరిశ్రమలో వారసులుగా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల కుమారులు కథానాయకులుగా పరిచయమై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ కుమారుడు హితేష్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం బండ్ల గణేష్‌ తన కుమార్తె జనని వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత్‌ కార్యక్రమంలో ఆయన కుమారుడు హితేష్‌ సందడి చేశాడు. పలు సినిమాల్లోని పాటలకు అద్భుతంగా డ్యాన్స్‌ చేసి అతిథులను ఆకట్టుకున్నాడు. తహితేష్‌ డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన రావడంతో.. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

సినీ పరిశ్రమలో బండ్ల గణేష్ కు మంచి గుర్తింపు

ఈ వీడియోలతో హితేష్‌ సినీ ఎంట్రీపై కొత్త చర్చ మొదలైంది. బండ్ల గణేష్‌ ఇప్పటికే తన కుమారుడికి హీరోగా అవసరమైన శిక్షణను సైలెంట్‌గా ఇప్పిస్తున్నారా? త్వరలోనే హితేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేయబోతున్నారా? అనే ప్రశ్నలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

అయితే హితేష్‌ హీరోగా ఎంట్రీపై ఇప్పటివరకు బండ్ల గణేష్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు హితేష్‌ డ్యాన్స్‌ చూసిన తర్వాత ఏదైనా నిర్మాత ఆయనకు సినిమా ఆఫర్‌ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బండ్ల గణేష్‌కు పరిశ్రమలో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుడిని గ్రాండ్‌గా హీరోగా లాంచ్‌ చేయాలని ఎవరైనా నిర్మాత ముందుకొస్తే.. టాలీవుడ్‌కు మరో కొత్త హీరో పరిచయమైనట్లే.

వివరాలు

త్వరలోనే అధికారిక స్పష్టత

అయితే హితేష్‌ను బండ్ల గణేష్‌ స్వయంగా హీరోగా పరిచయం చేస్తారా? లేక మరే నిర్మాత చేతుల్లో తన కుమారుడిని పెట్టి సినిమాల్లోకి తీసుకొస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఇక బండ్ల గణేష్‌ విషయానికొస్తే.. నటుడిగా, కమెడియన్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, థియేటర్‌ ఓనర్‌గా, వ్యాపారవేత్తగా ఆయన తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఆయన సినీ ప్రయాణం, లెగసీని తన కుమారులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తిని కలిగిస్తోంది.

ప్రస్తుతం హితేష్‌ సంగీత్‌ వేడుకలో వేసిన డ్యాన్స్‌ల వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరి మీరు కూడా బండ్ల గణేష్‌ తనయుడు హితేష్‌ చేసిన డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌ను చూసేయండి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరలవుతున్న వీడియోలు

ADVERTISEMENT