Bar In Theatre : దేశంలో తొలిసారిగా..జియో థియేటర్'లో బార్,వైన్స్... ఎక్కడో తెలుసా
సినిమా టాకీస్ అంటే ఇంటర్ వెల్'లో కూల్ డ్రింక్స్, సమోస, పాప్ కార్న్ లాంటివే ఉంటాయి. కానీ ఓ థియోటర్ మాత్రం ఇందుకు విభిన్నం. ఆ టాకీసులో ఎంచక్కా మందు కొట్టుచ్చు. ముంబైలోని ఓ థియేటర్'లో ఇది సాధ్యమవుతోంది. అక్కడ హిట్ అయితే హైదరాబాద్ వంటి మహానగరాలకు విస్తరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా జియో సంస్థ వినూత్నమైన ఆలోచన చేసింది. థియేటర్'లో బార్ అండ్ లాంజ్'ని ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఇటువంటి థియేటర్ ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఈ టాకీసులో కాక్ టైల్స్(Cock Tails) అందిస్తారు. అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారత మార్కెట్లో అతిపెద్ద లగ్జరీ మాల్ జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించింది.
టాకీసుల్లోకి చొచ్చుకువచ్చిన షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, గేమింగ్ సెంటర్స్
గతంలో థియేటర్స్ అంటే కేవలం సినిమాలు చూసేందుకు మాత్రమే ఉండేవి. వేగంగా మారుతున్న కాలంలో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, గేమింగ్ సెంటర్స్ వంటివన్నీ సినిమా కాంప్లెక్స్'లోకి చొచ్చుకువచ్చాయి. ఈ క్రమంలోనే లగ్జరీ సీట్స్ సహా సకల సౌకర్యాలు అందించేందుకు సినీ థియేటర్ ఓనర్స్ ముందుకు వస్తున్నారు. ముంబై మహానగరంలో అతిపెద్ద షాపింగ్ మాల్ జియో వరల్డ్ ప్లాజా గత నెల నవంబర్ 1న ప్రారంభమైంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఏరియాలో దీన్ని సిద్ధం చేశారు. ఈ ప్లాజాలో 66 లగ్జరీ బ్రాండ్ కంపెనీలు తమ స్టోర్లను ఏర్పాటు చేశాయి.
కొత్త జియో కాంప్లెక్స్'లో యానిమల్ సినిమా
ఈ సరికొత్త కాంప్లెక్స్'లో వ్యక్తిగత షాపింగ్ సహాయం, మల్టీప్లెక్స్ థియేటర్, గౌర్మెట్ ఫుడ్ ఎంపోరియం లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజా బార్ అండ్ రెస్టారెంట్ ముంబైలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ థియేటర్'లో యానిమల్ సినిమా ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లూ కాంప్లెక్స్‌లో ఈ లగ్జరీ మాల్‌ను రిలయన్స్ ఏర్పాటు చేసింది. మరోవైపు దేశంలో టాప్-ఎండ్, గ్లోబల్ స్టాండర్డ్ షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు రిటైల్ జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించనుంది. ముంబై నడిబొడ్డున BKCలో జియో వరల్డ్ ప్లాజా(JWP), నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌కు సమీపంలో సందర్శకులకు దగ్గరగా ఏర్పాటు చేసింది.