NTR:'ప్రభుత్వ సంకల్పంలో మీరూ భాగస్వాములు అవ్వండి'.. యువతకు ఎన్టీఆర్ ఆహ్వానం
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. ఎన్టీఆర్ తనవంతుగా యాంటీ నార్కోటిక్ టీమ్‌కి మద్దతు ప్రకటించి, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, కొంతమంది యువత తాత్కాలిక ఆనందం కోసం లేదా ఒత్తిడిని తట్టుకోలేక మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ వల్ల నష్టపోవద్దు
జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ వల్ల నష్టపోవద్దు అని, తనతో కలిసి డ్రగ్స్ రహిత సమాజం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.