NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బెదురులంక 2012 రివ్యూ: యుగాంతం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా? 
    తదుపరి వార్తా కథనం
    బెదురులంక 2012 రివ్యూ: యుగాంతం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా? 
    బెదురులంక 2012 రివ్యూ

    బెదురులంక 2012 రివ్యూ: యుగాంతం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 25, 2023
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు

    దర్శకత్వం: క్లాక్స్

    నిర్మాణం: లౌక్య ఎంటర్ టైన్మెంట్స్

    సంగీతం: మణిశర్మ

    కథ:

    ఈ సినిమా కథ 2012నాటి కాలంలో బెదురులంక అనే గ్రామంలో జరుగుతుంది. గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసే శివ(కార్తికేయ) సిటీ నుండి ఊరికి వస్తాడు. యుగాంతం జరగబోతుందని ఊరి జనాలందరూ భయపడతారు.

    ఆ భయాన్ని క్యాష్ చేసుకోవాలని అదే ఊరిలోని భూషణం(అజయ్ ఘోష్) అనుకుని దానికి బ్రహ్మ(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(ఆటో రామ్ ప్రసాద్) సాయం తీసుకుంటాడు.

    ఈ ముగ్గురూ కలిసి ఊరి వాళ్ళను ఎలా దోచుకోవాలనుకున్నారు. వీరి నుండి ఊరి జనాలను కాపాడటానికి శివ ఏం చేసాడనేదే కథ

    Details

    సినిమా ఎలా ఉందంటే? 

    సినిమా మొదలు కావడమే యుగాంతం వార్తతో మొదలవుతుంది. యుగాంతం వార్తల వల్ల ఆ ఊరిలో జరిగే అల్లరిని చక్కగా చూపించారు. ఫస్టాఫ్ మొత్తం కొన్ని కామెడీ సీన్లు, కొంత లవ్ ట్రాక్ తో సాగిపోయింది.

    లవ్ ట్రాక్ రెగ్యులర్ గానే ఉన్నప్పటికీ యుగాంతం ఆధారంగా అల్లుకున్న సీన్లు బాగున్నాయి. ఇక సెకండాఫ్ లో సత్య, వెన్నెల కిషోర్ ల కామెడీ సినిమాను ఎంతో సేవ్ చేసింది.

    క్లైమాక్స్ లో దర్శకుడు చాలా నవ్వించాడు. కామెడీ మిస్ కానీయకుండా సినిమా మొత్తాన్ని హాయిగా తీసుకెళ్ళాడు. ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా సాగుతుంది. కార్తికేయ, నేహా శెట్టి మధ్య లవ్ ట్రాక్ అంత గొప్పగా లేదని చెప్పవచ్చు.

    Details

    ఎవరెలా చేసారంటే? 

    కార్తికేయ చాలా సులభంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేహాశెట్టి పాత్ర పరిధి తక్కువగా ఉన్నా కూడా తన పరిధిలో ఆకట్టుకుంది.

    అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్, రాజ్ కుమార్ కసిరెడ్డిల మధ్య వచ్చే సీన్లు చాలా కొత్తగా ఉన్నాయి. వీరందరూ కూడా తమ పాత్రల్లో చక్కగా నటించారు.

    సత్య, వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో హైలైట్ గా నిలుస్తారు. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఫర్వాలేదనిపించాయి. కొత్త దర్శకుడు క్లాక్స్ తాను చెప్పాలనుకున్న పాయింట్ ని మంచి ఎంటర్ టైనింగ్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు.

    ఓవరాల్ గా చూస్తే బెదురులంక 2012 సినిమాను హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మూవీ రివ్యూ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    మూవీ రివ్యూ

    ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా
    మూవీ రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్
    దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా దసరా మూవీ
    రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా? రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025