Bellamkonda Sreenivas: సినిమాటిక్ స్టైల్‌లో ప్రపోజ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన ప్రేయసి కావ్య రెడ్డితో ఆయన పెళ్లి జరగనుంది. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఏప్రిల్ 6, ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
ప్రపోజల్ అదుర్స్..
నిశ్చితార్థ వేడుకలో భాగంగా, బెల్లంకొండ శ్రీనివాస్ తన ప్రేమను ఎంతో ప్రత్యేకంగా వ్యక్తం చేశాడు. సినిమాటిక్ స్టైల్‌లో చేసిన ఈ ప్రపోజల్ వీడియో ఇప్పుడు నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంలో 'Will you marry me' అని ముద్రించిన తెల్లటి టీషర్ట్లు ధరించిన కొందరు యువకులు స్టేజ్‌పైకి వచ్చి, తమ చేతుల్లో ఉన్న లవ్ బెలూన్స్‌ను గాల్లోకి వదిలారు. ఆ సమయంలో కావ్యతో కలిసి స్టేజ్‌పైకి వచ్చిన శ్రీనివాస్, మోకాలిపై కూర్చొని ఆమెకు ఉంగరం ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆ తర్వాత ఆమె వేళ్లకు ఆ రింగ్ తొడిగాడు. ఈ సర్ప్రైజ్‌తో కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై, ఆనందంతో చిరునవ్వులు చిందించింది. అనంతరం బాణాసంచా వెలుగులతో ఆకాశం కాంతులీనింది.
వివరాలు
క్యూట్ మూమెంట్స్ అంటూ పోస్ట్
ఈ అందమైన క్షణాలను అభిమానులు 'క్యూట్ మూమెంట్స్' అంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఇప్పటికే జరిగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలపై స్పందించిన శ్రీనివాస్, అది నిశ్చితార్థం కాదని, కేవలం పరిచయ కార్యక్రమం మాత్రమేనని స్పష్టత ఇచ్చాడు. ఇప్పుడు అధికారికంగా వీరి నిశ్చితార్థం జరిగింది. శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే కావ్య రెడ్డి గురించి ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఆమెకు సినీ రంగంతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె తాత గతంలో న్యాయమూర్తిగా పనిచేసినట్టు సమాచారం. అలాగే ఆమె తండ్రి న్యాయవాదిగా ఉన్నారని తెలుస్తోంది.
వివరాలు
వరుస ప్రాజెక్టులతో బిజీగా హీరో..
శ్రీనివాస్, కావ్య మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'టైసన్ నాయుడు', 'హైందవ', 'రామం' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన చేస్తున్న ఈ మూడు సినిమాలు కూడా కథాపరంగా ప్రత్యేకత కలిగి ఉన్నాయని తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో:
Cute Moments of #BellamKonda 🥰
— Milagro Movies (@MilagroMovies) April 6, 2026
#SreenivasaKavyanam #BellamKondaSaiSreenivas pic.twitter.com/9XUAtsiUPd