LOADING...
Arun Roy: కొత్త ఏడాదిలో బెంగాలీ ఫిల్మ్ మేకర్ అరుణ్ రాయ్ మృతి
కొత్త ఏడాదిలో బెంగాలీ ఫిల్మ్ మేకర్ అరుణ్ రాయ్ మృతి

Arun Roy: కొత్త ఏడాదిలో బెంగాలీ ఫిల్మ్ మేకర్ అరుణ్ రాయ్ మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త ఏడాదిలో బెంగాలీ దర్శకుడు అరుణ్ రాయ్ 56 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడిన అరుణ్ రాయ్, ఇటీవల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరారు. క్యాన్సర్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి తోడు ఆయన రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో చికిత్స కొనసాగించినప్పటికీ, ఈ రోజు ఉదయం 7 గంటలకు మరణించారు. అరుణ్ రాయ్ అసలు పేరు అరుణవ రాయచౌధురి. 2011లో విడుదలైన "ఎగారో" సినిమా ద్వారా బెంగాలీ సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమా విమర్శకుల నుంచి అనేక ప్రశంసలు పొందింది. తర్వాత "హీరాలాల్", "చోలై" వంటి అనేక విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. ఆయన చివరిగా "బాఘా జతిన్" సినిమాకు దర్శకత్వం వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫిల్మ్ మేకర్ అరుణ్ రాయ్ మృతి