LOADING...
భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు 
బాలయ్య 108వ సినిమాకు భగవంత్ కేసరి టైటిల్ ఫిక్స్

భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 08, 2023
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణ పుట్టినరోజుకు రెండు రోజుల ముందుగానే టైటిల్ ని రివీల్ చేసారు. అయితే భగవంత్ కేసరి విడుదల తేదీని మాత్రం వెల్లడి చేయలేదు. దసరా కానుకగా రిలీజ్ అవుతుందని తెలియజేసారే కానీ తేదీని మాత్రం బయటపెట్టలేదు. మరి విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తోంది. హీరోయిన్ శ్రీలీల, కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ అందిస్తున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ  షైన్ స్క్రీన్ ట్వీట్

Advertisement